Home » శిల్పారామంలో కనుల విందుగా భరతనాట్య నృత్య ప్రదర్శన

శిల్పారామంలో కనుల విందుగా భరతనాట్య నృత్య ప్రదర్శన

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ ఫో సందడిగా సాగుతుంది. పలు రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారుల చేనేత వస్త్రాలను విక్రయిస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాల స్టాల్స్ సందర్శకుల కోసం నెల రోజుల పాటు అందుబాటులో ఉండనున్నాయి. మంగళవారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రాగసుధ డాన్స్ అకాడమీ గురువర్యులు అనురాధ శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్యం నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, జతిస్వరం, శబ్దం, ఎందరో మహానుభావులు, త్యాగరాజ కృతి, అన్నమయ్య సంకీర్తనలు, అయిగిరి నందిని, ఆనంద నర్తన గణపతిమ్, నటేశకౌతం గురు వందన,ముద్దుగారేయ్ యశోద మొదలైన అంశాలను మనస్వి,రుచిత,హన్సి,దివ్య, నిర్వి,రీమా,ఖుషి,శ్రీవల్లి,ప్రవల్లిక తదితర కళాకారుల నృత్య ప్రదర్శన చూపరులను కట్టిపడేసింది.

You may also like

Leave a Comment