Home » శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు

శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు

by Admin
970Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మాదాపూర్‌ శిల్పారామంలో మై హ్యాండ్లూమ్ – మై ప్రెండ్ అనే అంశంపై డెవ‌ల‌ప్ మెంట్ ఆప్ క‌మిష‌న‌ర్ హ్యాండ్లూమ్స్,మినిస్ట్రీ ఆప్ వి టెక్స్ టైల్స్ న్యూ ఢిల్లీ వీవ‌ర్స్ స‌ర్వీసింగ్ సెంట‌ర్ హైద‌రాబాద్ శిల్పారామం సంయుక్తంగా డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో నిర్వహిస్తుంది.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,మధ్య ప్రదేశ్,చత్తీస్గర్ద్, రాజస్థాన్ రాష్ట్రాలకి చెందిన చేనేత కళాకారులు పాల్గొన్నారు.చేనేత ఉత్పత్తులను మంచి డిజైన్స్ మంచి రంగులో సందర్శకులకు పోచంపల్లి, గద్వాల్, కోట, ధర్మవరం, భాగల్పూరి, మంగళగిరి,కలంకారీ, మొదలైన చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్స్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి.శనివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ పాద శ్రీ వల్లభ కూచిపూడి ఆర్ట్ అకాడమీ కుమారి స్నేహలత శిష్య బృందం చే కృష్ణం వన్డే జగత్గురుమ్  శ్రీ కృష్ణుడికి సంబంధించిన పాటలపై కూచిపూడి నృత్యం ప్రదర్శన ఇచ్చారు. మూషిక వాహన, ఝేమ్ తనన ,స్వాగతం కృష్ణ, మరకత మణిమయ, కృష్ణాష్టకం, క్షీర సాగర శయన, ధనశ్రీ తిల్లాన ,మంగళం అంశాలను స్నేహలత, హర్షిని, భావన, అంజనా, అక్షయ, లక్ష్మి కళాకారులు ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ఎమ్ఎస్ మూర్తి,దుర్గ శేషు ,జనార్దన్ ,విజయ లక్ష్మి ముఖ్య అతిధులుగా పాల్గొని కళాకారులను అభినందించారు.

You may also like

Leave a Comment