Home » శిల్పారామంలోఆకట్టుకుంటున్నఆలిండియా క్రాఫ్ట్ మేళ…. అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

శిల్పారామంలోఆకట్టుకుంటున్నఆలిండియా క్రాఫ్ట్ మేళ…. అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

by Admin
370Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శిల్పారామం లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా  క్రాఫ్ట్స్ మేళాకు సందర్శకుల నుండి విశేష స్పందన వస్తుంది.ఆదివారం సెలువు దినం కావడంతో అధిక సంఖ్యలో సందర్శకులు చేనేత హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఈ మేళాలో బాటరీ  కార్, బోటింగ్, ఎడ్ల బండి  అందుబాటులు ఆకట్టుకున్నాయి.హస్తకళల స్టాల్ల్స్ తో రంగు రంగుల పూల మొక్కలతో , లైటింగ్  తో సందర్శకులకు  ఎంతగానో ఆనందిస్తున్నారు. పచ్చని వాతావరణంలో సందర్శకులు సేద  తీరుతున్నారు.బొంగు తో తాయారు చేసిన కుర్చీలు, కార్పెట్, వాల్ హ్యాంగింగ్స్, పుల్కారి చీరలు , గుజరాత్ శాలువాలు, నారాయణపేట, బనారస్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్,  ఉత్తర్ ప్రదేశ్ బ్రాస్, వరంగల్ దార్రిస్, జ్యూట్ బాగ్స్, ఆయిల్ పెయింటింగ్, పటచిత్ర పెయింటింగ్స్  ఆకట్టుకుంటున్నాయి.సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా హంపి థియేటర్ సముద్రాల మాధవి రామానుజం బృందం “రామానుజ్జ పూర్వ వైభవం ” భరతనాట్య నృత్య రూపకంలో ప్రదర్శించారు. ఆచార్యులు భగవద్ రామానుజం చరిత్రను వైష్ణవ సాంప్రదాయ వైభవాన్ని చరిత్రను కళ్లకుకటినట్టు సముద్రాల మాధవి రామానుజం, అడవిత, అరుణ, గాయత్రీ, రిషిక, చిన్మయి, హిమబిందు, భావన యాదవ్, కీర్తి, ప్రాచి తదితర కళాకారులు ప్రదర్శించారు.

You may also like

Leave a Comment