Home » శిల్పరామంలో ఆకట్టుకుంటున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా

శిల్పరామంలో ఆకట్టుకుంటున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా

by Admin
400Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : మాదాపూర్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో గురువారం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్బంగా భ ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేణుక ప్రభాకర్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో మోదమున గణపతికి, ఇందరికి అభయమ్ము, సరస్వతి, అష్టలక్ష్మి స్తోత్రం, కృష్ణ జనన శబ్దం, గరుడ గమన, అన్నమాచార్య కీర్తన అంశాలను మేఘన, రూప రవళి , కౌముది, అంశిత, లాస్య, లోహిత, రీతిక తదితరులు ప్రదర్శించారు. అనంతరం డా. హిమబిందు కనోజ్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో జయ జయ స్వామిన్, జతిస్వరం, ముద్దుగారేయ్ యశోద, శక్తం అంశాలను మేఘన, ఉజ్వల, శ్రీ రంజని, ఆశ్రిత, సృజన, రక్షా తదితరులు ప్రదర్శించి అందరిని ఆకాటుకున్నారు.

You may also like

Leave a Comment