
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం సెంటర్ ఫర్ ఆర్ట్స్ మీడియా అండ్ సోషల్ వెల్ఫేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ అల్తాఫ్ ఆధ్వర్యం లో మహిళలు చిన్నారుల మీద జరుగుతున్నా అకృత్యాలను ఎలా అరికట్టాలి తెలియజేస్తూ “బ్రేక్ ది సైలెన్స్” అనే లఘు నాటకం సౌజన్య, సాయి కదిరి, విష్ణు, మనోజ్, సాయి కృష్ణ, భరణి మొదలైన వారు ప్రదర్శించారు. పంచమ వేదం స్కూల్ అఫ్ ఆర్ట్స్ లాలన సృజన ఆధ్వర్యం లో వారి శిష్య బృందం కూచిపూడి ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, పుష్పాంజలి, నమశ్శివాయతేయ్, రామాయణ శబ్దం, ఆనంద తాండవం, ఒకపరి కొకపరి, అష్ట లక్ష్మి స్టోతోరం, నీలమేఘ శరీర, ముద్దుగారేయ్ యశోద, బ్రహ్మోస్తవమ్, మొదలైనవి ప్రీతీ, కామాక్షి, శ్రావణి, దృషిక, తనిష్క, ధన్య, అన్నపూర్ణ, శ్వేతా, శాన్వి మొదలైన వారు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ భాగవతుల సేతురాం ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.