Home » శిల్పకళా వేదికలో సూర్య ది గ్లోబల్ స్కూల్ 10వ వార్షిక వేడుకలు

శిల్పకళా వేదికలో సూర్య ది గ్లోబల్ స్కూల్ 10వ వార్షిక వేడుకలు

by Admin
13.1kViews
95 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : మాదాపూర్ శిల్పకళా వేదికలో ఆదివారం బాచుపల్లిలోని సూర్య ది గ్లోబల్ స్కూల్ 10వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ… చదువులతో పాటు బాహ్య ప్రపంచాన్ని విద్యార్థులకు ఎప్పటికప్పుడు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు ఆసక్తిని కనబరిచేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిందిగా తెలిపారు. అనంతరం అకాడమిక్ ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడలిని అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఛీఫ్ పిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ వీవీఎస్ చంద్రశేఖర్, జీపీ బిర్లా ఆర్క్యలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ కేజీ కుమార్, పాఠశాల ఫౌండర్, చైర్మెన్ ఆర్ రావు, జీ దామోదర్రావు, ప్రిన్సిపాల్ లక్ష్మీ ధరిత్రి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment