Home » శభాష్ భీమ్లా నాయకా..

శభాష్ భీమ్లా నాయకా..

by Admin
1.4kViews

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా నుండి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన టైటిల్ సాంగ్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విడుదలైంది. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ కి తోడు తమన్ సంగీతం జూలు విదిలించినట్టుగా ఉంది ఆద్యంతం ఈ పాట. అవకాశం ఉంటే తన ప్రతీ సినిమాలో ఏదో విధంగా జానపదాలను వినిపించడానికి ముందుండే పవర్ స్టార్ ఈ దఫా ఎప్పటిలాగే అంచనాలకందకుండా అద్భుతమైన పాటతో అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపుజేశాడు. ఐఏఎస్ ల నుండి ఆటో రిక్షా వాళ్ళ వరకు అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నారు. ఆడంబరాలకు పోని ఆయన హుందాతనానికి నేడు ఆయన క్రేజ్ నిదర్శనం. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ తో రోమాలునిక్కబొడిచే విధంగా అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన భీమ్లా నాయక్ టీం ఎఫర్ట్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

 

You may also like

Leave a Comment