Home » శంకర్ పల్లి పరిధిలో జరిగిన హత్య కేసును చెందించిన పోలీసులు అభినందించిన ఏసీపీ రవీందర్ రెడ్డి

శంకర్ పల్లి పరిధిలో జరిగిన హత్య కేసును చెందించిన పోలీసులు అభినందించిన ఏసీపీ రవీందర్ రెడ్డి

by Admin
450Views

తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి: ఈ నెల 11వ తేదీన ఆలంఖాన్ గూడ గేట్ సమీపంలో గల శుభ గృహ వెంచర్ గేటు వద్ద అతి కిరాతకంగా హత్యకు గురైన మహాలింగాపురం వాసి అయినా బోడ వెంకటయ్య హత్య కేసును పోలీసులు చేధించి హంతకులను అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ళ ఏసిపి రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..వెంకటయ్య కి సమీప బంధువులైన అశోక్, పవన్ లు హత్య చేసినట్లుగా గుర్తించారు. అశోక్  శంకర్ పల్లి మండలం దొంతన్ పల్లి గ్రామం, అతని కి ఒక చెల్లెలు. చెల్లెలు ని మహాలింగాపురం గ్రామానికి చెందిన రాములికి ఇచ్చి 23 ఏళ్ల క్రితం వివాహం చేశారు. రాములు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అశోక్ కి దోంతన్ పల్లి గ్రామం లో సర్వే నెంబర్ 87 లో 30 గుంటలు సర్వే నంబర్ 200/ఆ లో 1 ఎకరా 18 గుంటలు పొలం కలదు.మొత్తం భూమిలో తన వాటా కావాలని అశోక్ తో చెల్లెలు అమృత గొడవపడి కోర్టులో కేసు వేసింది. అయితే అశోక్ పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చుకుందాం అని చెల్లెలు కి చెప్పగా నిరకరించిన అమృత. రాజీ కి ఒప్పుకోని అమృతను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు అశోక్. అతనికి సహకరించవలసిందిగా అమృత మరిది అయిన బోడ వెంకటయ్య సహాయం కోరగా ఐదులక్షలకు సుఫారి మాట్లాడి హత్య చేస్తానని వెంకటయ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంకటయ్య అశోక్ నుండి సుమారు 4లక్షల వరకు దఫలవారీగా డబ్బులు వసూలు చేసుకొని పనిచెయ్యక పోగా మళ్ళీ డబ్బులు డిమాండ్ చేశాడు. దీనితో వెంకటయ్య మీద అశోక్ కోపం పెంచుకొని ఎలాగైనా వెంకటయ్య ను చంపాలని పథకం పన్ని అశోక్ సడ్డకుని కొడుకు సదాశివపేట మండలం రెండ్లపల్లి గ్రమవాసి అయిన పవన్ సహాయంతో శనివారం రాత్రి 2 గంటల సమయంలో అశోక్ వెంకటయ్య కు ఫోన్ చేసి మాట్లాడదాం అని శుభ గృహ వెంచర్ దగ్గరికి రావాలని పిలిచారు. వెంకటయ్య రాగానే అశోక్ మాట్లాడుతుండగా పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కారంపొడి చల్లి కత్తితో వెంకటయ్య పై వెనకనుంచి పవన్ దాడి చేశారు. ఈ క్రమంలోని అశోక్ పవన్ లు వెంకటయ్య పై దాడి చేసి అతి కిరాతకంగా చంపి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు ఆధారాలు దొరకకుండా వెంకటయ్య అశోక్ సెల్ ఫోన్ తగలబెట్టి పాత పెట్టారు, మొబైల్ సిగ్నల్, కాల్ డేటా ఆధారంగా ఈ నెల 15 బుధవారం రోజున నిందితులను వారి నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేశామని పోలీసుల ఎదుట ఒప్పుకొన్నారు. ఈ కేసును ఛేదించిన సిఐ మహేష్ గౌడ్ మరియు ఎస్ఐలు సంజీవ , లక్ష్మీ నారాయణ లను చేవెళ్ళ ఏసీపీ రవీందర్ రెడ్డి వారిని అభినందించారు.

You may also like

Leave a Comment