Home » వైభవంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం

వైభవంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : బీరంగూడలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహాత్సవం మహాశివరాత్రి పర్వదినాన కనుల పండువగా జరిగింది .ఈ కల్యాణోత్సవంలో అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి దంపతులు,శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ రెడ్డి,దేవాలయ పాలక మండలి చైర్మన్‌ తులసిరెడ్డి దంపతులు,వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ దంపతులు సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ కల్యాణ మహాత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు .గుట్టపై మహాశివరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయని,భక్తులు  స్వామి వారిని సంతోషంగా దర్శించుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

You may also like

Leave a Comment