
● ఈ ఏడాది మరో 4 ఆసుపత్రుల ప్రారంభం
● మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలకు విస్తరణ
● రానున్న కాలంలో ఇప్పుడు ఉన్న 1000 పడకలు రెట్టింపుగా మొత్తం 2000కు చేరుకోనున్నాయి
● హాస్పిటల్ తో తన అనుబంధాన్ని పంచుకున్న ప్రచారకర్త సోనూ సూద్
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: వైద్య రంగంలో మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేకించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెయిన్ గా, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ లలో 12 కేంద్రాలతో ఉన్న అంకుర హాస్పిటల్స్ నూతన కేంద్రాల ప్రారంభించనుంది. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలకు విస్తరించనుంది. అంకుర హాస్పిటల్స్ ప్రచారకర్త అయిన ప్రఖ్యాత నటుడు, సామాజిక కార్యకర్త అయిన సోనూ సూద్ ఈ హాస్పిటల్స్ తో తన అనుబంధాన్ని మరింత పటిష్ఠం చేసుకోనున్నారు.
ప్రస్తుతం అంకుర హాస్పిటల్స్ తన 12 కేంద్రాలతో అంకిత భావం కలిగిన వృత్తినిపుణుల బృందంతో మహిళలు, పిల్లల అవసరాలను తీరుస్తోంది. పిడిట్రీషియన్స్, పిడియాట్రిక్ సూపర్ స్పెషలిస్టులు, గైనకాలజిస్టులు, ఫిజీషి యన్లు, రేడియాలజిస్టులు, అంకితభావం కలిగిన, బాగా శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది, ఇతర సపోర్టింగ్ సి బ్బంది ఈ బృందంలో ఉన్నారు. ఈ మొత్తం 12 కేంద్రాలు కూడా తిరుగులేనివిధంగా, అత్యాధునిక సాంకేతికత ను కలిగి లెవల్ III NICUs, PICUs, OTs,& లగ్జరీ బర్తింగ్ సూట్స్ ను కలిగిఉన్నాయి.
కోవిడ్ సమయంలో రోగులకు చికిత్సలో, ప్రసవాలలో ఈ హాస్పిటల్ తిరుగులేని విధంగా 99% సక్సెస్ రేటును కలిగిఉంది.
విస్తరణ ప్రణాళికల గురించి అంకుర హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ‘‘దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న హాస్పిటల్ చెయిన్ లో మాది ఒకటి. ప్రపంచ నాయకత్వ స్థానాన్ని మన దేశం మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉండి, ఆరోగ్య సంరక్షణ నాయకత్వం, వైద్య వినూత్నత కీలకంగా మారిన సమయం లో మనం జీవిస్తున్నాం, పని చేస్తున్నాం. దీన్ని సాధించేందుకు మహిళా, శిశు ఆరోగ్య సంరక్షణ అనేది అ త్యంత ప్రాథమికం అవుతుంది. ప్రపంచంలో యువత అధికంగా మన దేశంలోనే ఉంది. అందులో సగం మంది మహిళలు. అందువల్ల ఈ నిర్దిష్ట విభాగం మన దేశపు సామాజిక, ఆర్థిక వృద్ధిని తీర్చిదిద్దుతుందని నేను వి శ్వసిస్తాను. మహిళా, శిశు విభాగంలో దేశంలో అతి పెద్దది మాత్రమే గాకుండా అత్యంత అధునాతన ఆరోగ్య సంరక్షణను అందించేదిగా కావడాన్ని అంకుర హాస్పిటల్స్ లో మేం మా ఆశయంగా పెట్టుకున్నాం. ఈ గొప్ప ఆ శయంలో భాగంగా మేం ఈ ఏడాది హైదరాబాద్ లో మరో 4 కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. అంతేగాకుండా పొ రుగునే ఉన్న మహా రాష్ట్ర, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలకు విస్తరిస్తున్నాం. రాబోయే ఏళ్లలో మా సామర్థ్యాన్ని 1000 నుంచి 2000 పడకలకు రెట్టింపు చేసుకోనున్నాం’’ అని అన్నారు.
‘‘ఈ విజయవంతమైన ప్రయాణంలో ప్రతీ ఒక్కరికీ మా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మా ప్రచారకర్త, గొప్ప మానవతావాది సోనూ సూద్ గారికి. ఏడాది క్రితం ప్రారంభమైన మా అనుబంధం రోజురోజుకీ మరింత పటిష్ఠమవుతోంది’’ అని అన్నారు.
అంకుర హాస్పిటల్స్ ప్రచారకర్త సోనూ సూద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘గత ఏడాది కాలంగా అంకుర హాస్పిటల్స్ తో అనుబంధం నాకెంతో ఆనందదాయకం. ఎందుకంటే ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించి మేం పంచుకునే విలువలు, దృక్పథాలు ఒక్కటే. యావత్ మానవ జాతి చరిత్రలోనే అత్యంత భయానక ఆరోగ్య సంక్షోభ దశల్లో ఒకటైన కోవిడ్ కాలంలో మేం ఒక్కచోటుకు చేరాం. అంకుర బృందం వృత్తినైపుణ్యం, రోగుల పట్ల సంరక్షణ ధోరణి చూసి నేను తక్షణమే వారితో కలసిపోయాను. అంకుర హాస్పిటల్స్ లో బాగా అనుభవం కలిగిన వైద్యుల బృందం ఉండడం కూడా మా అనుబంధానికి మరో కారణం. కోవిడ్ కాలంలో నేను వ్యక్తిగతంగా ఎంతో మంది బాగా అనారోగ్యానికి గురైన వారిని రెఫర్ చేశాను. వారు కాపాడబడ్డారు. అనుభవం కలిగిన వైద్య బృందంచే వారికి ఆరోగ్యదాయక జీవితాలు దక్కాయి. ఇతర రాష్ట్రాలకు అంకుర విస్తరణ అనేది అవసరమైన వారికి ఎంతోమంది నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెచ్చింది. ఈ అనుబంధం మరింత పటిష్ఠం కావడం నాకెంతో సంతోషదాయకం’’ అని అన్నారు.
అంకుర హాస్పిటల్స్ గురించి:
అంకుర హాస్పిటల్స్ అనేది హైదరాబాద్ లోని సైబర్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న, మహి ళలు, పిల్లల సూపర్ – స్పెషాలిటీ చెయిన్. 2011లో ఇది ప్రారంభించబడింది. నేడు ఇది తెలుగు రాష్ట్రా ల్లోని పలు ప్రాంతాలకు తన కార్యకలాపాలు విస్తరించింది. అంకుర హాస్పిటల్ ఎన్ఏబీహెచ్ అక్రెడిటెడ్ విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ కేంద్రం. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలకు ఇది మల్టీ స్పెషాలిటీ టెరిటరీ, క్వాటెరినరీ సేవల ను అందిస్తోంది. హా స్పిటల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 12 ప్రాంతాల్లో మొత్తం 1000 ఆపరేష నల్ బెడ్స్ సామర్థ్యాన్ని కలి గి ఉంది. ఈ హాస్పిటల్ గ్రీన్ ఓటీ, లెవెల్ 3 ఎన్ఐసీయూ, పీఐసీయూలను కలిగిఉంది. ఇది తన క్రిటికల్ కేర్ టీమ్ కు ఎంతో పేరొందింది. ఈ హాస్పిటల్ అత్యంత అధునాతన సదు పాయాలను, ఉపకరణాలను, ఆధునిక క మ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కలిగి ఉంది.