
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి పరిధిలోని గోపనపల్లి విష్టా ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం టెంపస్ ఫుజిట్ పేరిట ఏర్పాటు చేసిన సాహిత్య, చరిత్ర, గణితం, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. నాటి రాతి యుగం నుంచి నేటి ఆధునిక కాలం వరకు ఉన్న పరిణామాలు, ఆవిష్కరణలకు అద్దంపడుతూ విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలు విశేషంగా ఉన్నాయి. నాటి ప్రజల జీవనశైలి, ఆచార్యవ్యవహారాలు, ఆహారపు అలవాట్లును, అప్పట్లో నిర్మించిన తయారు చేసిన కళాకృతులు దేనికదే ప్రత్యేకంగా ఉంది. చరిత్రలో నిలిచిపోయిన పలు ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపుతూ విద్యార్థులు ప్రదర్శించిన నాటకం అందరినీ ఆలోచింపజేసింది. ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రదర్శనకు తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా డా. కె బాబురావు మాట్లాడుతూ చిన్నారుల్లో సృజనను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదం పిల్లల్లో ఉండే ఆసక్తిని గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విస్టా ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ వెల్లంకరావు, డైరెక్టర్ తదితరులున్నారు.