Home » వివేకానంద యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

వివేకానంద యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలు బుధవారం ఉదయం పరిగి పట్టణంలోని 15వ వార్డులోని స్వామి వివేకానంద చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యువజన సంఘం సభ్యులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల స్వామి వివేకానంద యువజన సంఘాల అధ్యక్షుడు పర్షమోని బాబు, గౌరవ అధ్యక్షుడు కె. శ్రీశైలం, ఉపాధ్యక్షుడు కె. అనిల్ కుమార్,పి. వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బి.బాబు,ఎం‌. నాగేష్, కార్యదర్శులు కె. రమేష్, పి. రమేష్, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల, ప్రజా సంఘాల నాయకులు దోమ శ్రీశైలం, పెంటయ్య, రాము, గోపాల్, చంద్రమోహన్, సంతోష్, నవీన్, నరేష్, అనంతయ్య, లక్ష్మణ్, కె. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment