
1.2kViews
హైదరాబాద్ (తెలంగాణ మిర్రర్): క్రికెట్ ప్రపంచంలో టెస్టులకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. ఈ ఐదు రోజుల సమరంలో తాడో పేడో తేల్చుకోవడం అంత సులువు కాదు. ఎన్నో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థికి సవాల్లు విసురుతూ ఉండాలి. అలాంటి సక్సెస్ రేట్ లో ఇప్పుడు భారత జట్టు నాయకుడు విరాట్ కోహ్లీకి అరుదైన స్థానం దక్కింది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్స్ రీకీ పాంటింగ్, స్టీవ్ వాలు వరుసగా రెండు,మూడు స్థానాల్లో ఉన్నారు. 63 టెస్టుల్లో 37 విజయాలు సాధించి కోహ్లీ నాలుగో స్థానంలో, విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ ఐదో స్థానంలో ఉన్నారు. లార్డ్స్ టెస్ట్ మ్యాచులో విజయం ద్వారా విరాట్ ఈ ఘనత సాధించాడు.