
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ఆర్టీసీని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలనే కేబినెట్ నిర్ణయాన్ని హర్షిస్తూ మియాపూర్,హెచ్ సి యు ఆర్టీసి డిపోలో ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్,జగదీశ్వర్ గౌడ్,హమీద్ పటేల్ ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతని , అసాధ్యాలు, సుసాధ్యాలు చేసే ఘనత కేసీఆర్ కే దక్కుతుందని,ఎవరు కలలో కూడా ఊహించని విధంగా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటారని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఎప్పట్నుంచి బాధల్లో, కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన గొప్ప వరం అందించి వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని ప్రభుత్వ విప్ గాంధీ ఆనందం వ్యక్తం చేశారు. గత కొంతకాలంలో ఆర్టీసీ కార్మికులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వీరికి స్వరాష్ట్రంలో సముచిత స్థానం దక్కలేదని భావన ఉండేది , కానీ నేడు కేసీఆర్ గారు ఏకంగా కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని, ఇది ఎంతో పెద్ద మనస్సుతో ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరమని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ ప్రతినిధులు,ఉద్యమకారులు, తదితరులు పాల్గొన్నారు.