
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికి తెరాస నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేయభిలాషులకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనాధికారులకు, మిత్రులకు ఆత్మీయులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు వినాయకుడు అని అందుకే ఆయన్ను విఘ్నేశ్వరుడు అంటారు అని ఎంతోమంది దేవుళ్లు ఉన్నప్పటికీ మొదట పూజలు అందుకునేది ఆయనే కాబట్టి ఆదిదేవుడుగా కొలుస్తారు అని ఏనుగు తల, మనిషి శరీరం కలిగి ఉండి ఒకే దంతం కలిగి ఉండటంచేత ఏకదంతుడుగా కీర్తించబడుతున్నాడు అని దేవగణాలకు అధిపతి కాబట్టి గణపతిగా పూజలు అందుకుంటున్నాడు అని సకల లోకాల సర్వ జనులకు శుభాలు కలిగించే ఆ బొజ్జ గణపయ్య పండుగ వినాయక చవితిని అందరూ ఘనంగా జరుపుకుంటారు అన్నారు. పండుగ ను చక్కటి వాతావరణంలో కుటంబసభ్యుల మధ్య ఆనందాయకంగా, సంతోషకరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిదంగా వినాయక చవితి పండుగ ను ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని రకాల వసతులు కలిపించాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలనీ అధికారులను ఆదేశించడం జరిగినది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ నిర్వహించుకునేలా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలనీ ప్రభుత్వ విప్ గాంధీ అధికారులను ఆదేశించారు.