Home » విద్యుత్ శాఖ అధికారులతో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమావేశం

విద్యుత్ శాఖ అధికారులతో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమావేశం

by Admin
10.6kViews
86 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :   శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై సంబంధిత శాఖ అధికారులతో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గచ్చిబౌలి విద్యుత్ శాఖ కార్యాలయం లో సమీక్ష సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ లో నెలకొన్న విద్యుత్ సంబంధిత సమస్యలు వేలాడుతున్న విద్యుత్ తీగలు సరిచేయడం, ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ కంచె వేయడం, అవసరమున్న చోట స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, గృహాల వినియోగదారులకు విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. విద్యుత్ లైన్లు పురాతన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని సూచించారు. రోడ్డు మీద అడ్డంగా ఉన్న స్తంబాలను ప్రక్కకు జరపాలని వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేయలని కోరారు. ఇందిరా నగర్ స్మశాన వాటికలో రోడ్డు మధ్యలో ట్రాన్స్ఫార్మర్ ను సర్దుబాటు చేయాలని కోరగా అక్కడే ఉన్న విద్యుత్ శాఖ అధికారులకు సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ లో విద్యుత్ శాఖ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతు వినతి పత్రం అందజేశారు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి . ఈ కార్యక్రమంలో డీఈ గోపాల‌ కృష్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ , గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, ఇందిరా నగర్ కాలనీ వాసులు రవి ధనరాజ్, మొదలగు వారు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment