Home » విద్యుత్‌ చార్జీలను తగ్గించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజా ఉద్యమం : బీజేపీ నాయకులు

విద్యుత్‌ చార్జీలను తగ్గించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజా ఉద్యమం : బీజేపీ నాయకులు

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని శేరిలింగంపల్లి బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర,జిల్లా బిజెపి పార్టీ ఆదేశాల మేరకు గురువారం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో నాయబ్ తహసిల్దార్ మణిపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు గజ్జల యోగనంద్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాన్ని అరికట్టేలా, సామాన్యులకు ఊరటనిచ్చేలా ఈ ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఉండాలే కానీ వెలుగులు నిండిన సామాన్యుల జీవితాల్లో చీకట్లు కమ్మేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రజల రక్తాన్ని పీల్చేలా ఉందని అన్నారు. ప్రతి 50-100 యూనిట్లకు శ్లాబుల పేరుతో చార్జీల భారాన్ని ప్రజలపై మోపడం దారుణమన్నారు. కూలీ-నాలీ చేసుకొనే మధ్య తరగతి జీవితాన్ని గడుపుతున్న ప్రజలకు రోజు గడవడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి పనికిమాలిన నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బంది పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోలేమని హెచ్చరించారు.కాగా తక్షణమే ఈ విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. లేని పక్షాన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా పార్టీ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహిపాల్ రెడ్డి,హరిక్రిష్ణ,రాంరెడ్డి,మణిక్ రావు,హరిప్రియ,చంద్రమోహన్,శ్రీనివాస్ రెడ్డి,మధు చారి,సత్య కురుమ, శ్రీరిష, గోవర్ధన్ రెడ్డి,నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment