
1.0kViews
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలని శ్రీచైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ వాణి పేర్కొన్నారు. శుక్రవారం నల్లగండ్ల శ్రీ చైతన్య సి.బి.ఎస్.ఇ పాఠశాలలో మాతృదేవత పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం అకాడమిక్ డీన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులను పూజిచ్చి వారి మాట వినే వాళ్లు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని,భవిష్యత్తులో ఉన్నత శిఖిరాలు అధిరోహిస్తారని చెప్పారు.అనంతరం విద్యార్థు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ మేరకు విద్యార్థులు తల్లిదండ్రులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.