
*అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో క్రీడల అభివృద్ధికి కృషి…
*సాయి కాలనీలో కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
తెలంగాణ మిర్రర్,అమీన్‌పూర్ : అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పేర్కొన్నారు.శనివారం మున్సిపల్ పరిధిలోని సాయి కాలనీలో నిర్వహించిన బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్ ను ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు క్రీడల పైన ఆసక్తి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలని చైర్మన్ సూచించారు.అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో టోర్నమెంట్ల నిర్వహణకు కృషి చేస్తున్నామని అన్నారు.ఈ మేరకు అమీన్‌పూర్ లో ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మినీ స్టేడియం పనులు ప్రారంభించామని చైర్మన్ పాండురంగారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్,క్రీడాకారులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.