Home » వికారాబాద్ జిల్లా లో పొంగిపొర్లుతున్న వాగులు

వికారాబాద్ జిల్లా లో పొంగిపొర్లుతున్న వాగులు

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, వికారాబాద్ : రాత్రి నుండి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిగా వర్షం కురుస్తుంది. జిల్లా లో 12.6 సె. మీ వర్షపాతం నమోదైంది. నిర్మాణంలో ఉన్న దాచారం బ్రిడ్జ్ పై నుండి పారుతున్న వరద నీళ్ల దాటికి హైదరాబాద్ – తాండూర్ మధ్య రాకపోకలు నిలిచాయి. కోటపల్లి ప్రాజెక్ట్ అలుగుతో నాగసమందర్- ధరూర్ మధ్య రాకపోకలు లేవు, అలాగే పరిగి-వికారాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. జిల్లా లో పొంగిపారుతున్న వాగులను స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ పరిశీలించారు. అదేవిదంగా స్థానిక అధికారులతో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే అధికారులను అలెర్ట్ గా ఉండాలని సూచించారు.

You may also like

Leave a Comment