
తెలంగాణ మిర్రర్, మియాపూర్: వరకట్న వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఈ మేరకు పోలీసులు కుంటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ కు చెందిన పావని ఆదిలాబాద్ కు చెందిన శ్రావణ్ ను వివాహం చేసుకుంది.కాగా కొంత కాలం సంతోషంగా జీవితం గడిపిన పావనిని కొంత కాలంగా తన భర్త శ్రావణ్,అత్తమామలు శకుంతల,హేమంత్ రెడ్డి,ఆడపడుచు వరకట్నం కావాలంటూ వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.ఐయితే భర్త శ్రావణ్ ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడని తెలిపాడు. కాగా మనస్తాపం చెందిన పావని శనివారం సాయంత్రం 7 గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.స్థానికుల పిర్యాదు మేరకు మియాపూర్ ఎసిపి సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుప్రతికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.