
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలు మేరకు, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గాంధీ ఆధ్వర్యంలో, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ రావు, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్ , శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, కొండాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ పేరుక రమేష్, సెక్రటరీ జె బలరాం యాదవ్, తెరాస సీనియర్ నాయకులు జంగం గౌడ్, రూప రెడ్డి, అడ్వకేట్ కృష్ణవేణి, మంగమ్మ, తిరుపతి యాదవ్, డా. రమేష్, గిరి గౌడ్, అబేద్ అలీ, రజనికాంత్, యూత్ నాయకులు దీపక్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.