Home » వడ్డెర జాతి ఆశాజ్యోతి ఓబన్న….. తెలంగాణ వడ్డెర జేఏసీ రాష్ట్ర నాయకులు పల్లపు యాదయ్య, ముద్దంగుల మల్లేష్

వడ్డెర జాతి ఆశాజ్యోతి ఓబన్న….. తెలంగాణ వడ్డెర జేఏసీ రాష్ట్ర నాయకులు పల్లపు యాదయ్య, ముద్దంగుల మల్లేష్

by Admin
1.2kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న అని తెలంగాణ వడ్డెర జేఏసీ రాష్ట్ర నాయకులు పల్లపు యాదయ్య, రంగారెడ్డి జిల్లా జేఎసి నాయకులు ముద్దంగుల మల్లేష్ లు అన్నారు.మంగళవారం వడ్డె ఓబన్న జయంతి వేడుకలను తెలంగాణ వడ్డెర జేఏసీ రాష్ట్ర నాయకులు,సీనియర్ రిపోర్టర్ పల్లపు యాదయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా చందానగర్ గాంధీ విగ్రహం వద్ద వడ్డె ఓబన్న చిత్ర పటానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డెర జాతికి ఆశాజ్యోతి లాంటి ఓబన్న చిరస్మరణీయుడని, బ్రిటిష్ వారిపై మొట్ట మొదటి సారీ తిరుగుబాటు చేసిన స్వతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న అని అన్నారు. ఓబన్న 215వ జయంతిని మనం ఘనంగా చందానగర్ లో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. 1845 – 47 సంవత్సరంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన వారిలో కీలక పాత్ర పోషించారని అన్నారు. వడ్డె ఓబన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండి సర్వ సైన్య అధ్యక్షుడుగా ముందుండి సైన్యాన్ని నడిపారని తెలిపారు. దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాలు అర్పించి అందరికీ ఆయన ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు వరికుప్పల కృష్ణ, కొమ్మ రాజుల రవికుమార్, ఇరగ దిండ్ల రవి, తాయప్ప, పల్లపు మధూకర్ , శివరాత్రి రాములు, యాదగిరి, మహేష్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment