
తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి విలేజ్ లో వంద శాతం వాక్సినేషన్ పూర్తి కావడంతో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గచ్చిబౌలి డివిజన్ ప్రతి కాలనీలో వంద శాతం వాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రజలు ముందుకు రావాలన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. గచ్చిబౌలి డివిజన్ వ్యాప్తంగా పలుచోట్ల మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను పర్యవేక్షించారు. ప్రత్యేక శ్రద్ధాతో అందరికి వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తున్నామని తెలియ చేశారు. దగ్గరలో ఉన్న వాక్సిన్ కేంద్రాల వద్దకు వెళ్లి కోవిడ్ టీకా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు రంగస్వామి, మాధు, నర్సింగ్ రావు, జీహెచ్ఎంసీ ఎస్ ఆర్ పీ భరత్, జి.హెచ్.ఎం.సి శానిటేషన్ సూపర్వైజర్ రాఘు, నగేష్ కిరణ్ కార్యకర్తలు పాల్గొన్నారు.