Home » లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

by Admin
1.5kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  మైనర్ బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. చందనాగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పలో నివాసo ఉండే ఓ మైనర్ బాలిక స్థానికంగా 10వ తరగతి చదువుతున్నది. అదే కాలనీ లో నివాసముంటున్న అరవింద్(21) డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా మైనర్ బాలిక స్కూల్, ట్యూషన్ కి వెళ్లి వస్తుంటే వేధింపులకు గురి చేస్తూ వెంటపడుతున్నట్లు బాలిక తండ్రి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. జూన్ 2 వ తేదీన బాలిక ఇంటి ముందు పార్క్ చేసిన బాలిక తండ్రి ద్విచక్రవాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించరని ఫిర్యాదులో తెలిపారు. వాహనాన్ని తగలబెట్టిన వ్యక్తి అరవిందే అని అనుమానంతో స్థానికులతో కలసి అతని పై దాడి చేశారు. బాలిక వేధింపుల విచారణ కోసం పోలీస్ స్టేషన్ కి వచ్చిన అరవింద్ పై బాలిక తండ్రి దాడి చేసినట్లు తిరిగి వారి పై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు. చేశాడు. వాహనాన్ని తగలబెట్టింది తను కాదని చెప్పిన వినిపించుకోకుంట స్థానికులతో కలసి దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ చేరుకొని తమకు న్యాయం చేయాలని స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పిర్యాదు చేసిన వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికి నిందుతున్ని అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిందుతుడిని అదుపులోకి తీసుకొని న్యాయం చేయాలని పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బాలిక తండ్రి పిర్యాదు మేరకు 354,354డీ, 508, 509, 11, 12 ఫోక్సో, బైక్ తగలబెట్టినందుకు 435లతో పాటు ఎస్సి ఎస్టీ కేసులను నమోదు చేసినట్లు స్టేషన్ ఇన్స్పెక్టర్ కాస్ట్రో తెలిపారు.

You may also like

Leave a Comment