Home » లింగంపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించిన సౌత్ ఇండియా సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో

లింగంపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించిన సౌత్ ఇండియా సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో

by Admin
1.2kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  లింగంపల్లి రైల్వే స్టేషన్ సందర్శనకై వచ్చిన సౌత్ ఇండియా సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో రైల్వే స్టేషన్ లాంజ్ లో పలు రైల్వే సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావసరాల దృష్ట్యా, ప్రయాణికుల కు సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తూ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తూ సుఖవంతమైన ప్రయాణానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని పేర్కొన్నారు.
సౌత్ ఇండియా సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తో చర్చించిన అంశాలు…
1)లింగంపల్లి పురాతన రైల్వే అండర్ బ్రిడ్జి ఇది ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది, వర్షాకాలంలో నీరు నిలువ ఉండి చాలా సమస్యాత్మకంగా మారుతుంది. ప్రజల రాకపోకలు అంతరాయం కలుగుతుంది, కావున పాత బ్రిడ్జి పక్కన మోడరన్ టెక్నాలజీ తో నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి.
2.ఆదిత్య నగర్ వద్ద రైల్వే ట్రాక్ కు సమాంతరంగా బాక్స్ డ్రైన్ నిర్మాణం, ఆదిత్య నగర్ నుండి మంజీరా పైప్ లైన్ రోడ్డు కు ప్రస్తుతం ఉన్న నాలా వెడల్పు పెంచడానికి అనుమతి ఇవ్వాలి.
3.శిల్ప గార్డెన్ వద్ద రైల్వే అండర్ పాస్ నుండి మంజీరా పైప్ లైన్ రోడ్డు లోని వైశాలి నగర్ వరకు వర్షపు నీటి కాలువ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి.
4.లింగంపల్లి ,చందానగర్ రైల్వే స్టేషన్ల మధ్యలో ఉన్న రైల్వే అండర్ పాస్ వద్ద నాలా వెడల్పు పెంచుచు రెండు ప్రక్కల సీసీ రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి.
5)లింగంపల్లిలో దుబే కాలనీ లోనీ డ్రైనేజీ సమస్య పై జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకు వచ్చారు.
6)లింగంపల్లి నుండి జైపూర్ వరకు జైపూర్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించాలని కోరారు.
7)హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ , రాజుకోట ఎక్స్ ప్రెస్,వికారాబాద్ ఎక్స్ ప్రెస్, గుంటూరు ఎక్స్ ప్రెస్స్ లింగంపల్లి స్టేషన్ లో ప్రజల సౌకర్యార్థం కొరకు నిలుపవలసిందిగా కోరారు.
8)ప్లాట్ ఫామ్ 2 ,4 వద్ద ఎక్సలేటర్ ఏర్పాటు చెయ్యాలని కోరారు.
9) 6వ ప్లాట్ ఫాం ఎదురుగా పార్కింగ్ ప్రదేశంను ఏర్పాటు చెయ్యాలని కోరారు.పలు రైల్వే సమస్యలపై చర్చించారు.రైల్వే సమస్యలు ప్రజల సమ్మతితో తీర్చాలని ఎంపీ డా.రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ లు కోరారు.దీంతో పలు అంశాల పట్ల సౌత్ ఇండియా సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య సానుకులంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో అధికారులు ఈఈలు శ్రీనివాస్, శ్రీకాంతిని,డీఈ స్రవంతి,ఏఈలు సునీల్,ప్రశాంత్ వాటర్ వర్క్స్ డీజీఎం నారాయణ మేనేజర్ యాదగిరి, మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్ , శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్ తెరాస నాయకులు చింత కింది రవీందర్, పొడుగు రాంబాబు ,కొండల్ రెడ్డి ,కృష్ణ యాదవ్, వేణుగోపాల్, నటరాజ్, రమేష్, రమణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment