Home » లింకు రోడ్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం : ప్రభుత్వ విప్ గాంధీ

లింకు రోడ్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం : ప్రభుత్వ విప్ గాంధీ

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రద్దీని తగ్గించడంతో పాటు కాలుష్యం పెరగకుండా ఉండేందుకు రహదారుల అభివృద్ధి చేస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ గాంధీ.మంగళవారం హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని  వైశాలి నగర్ నుండి (మసీదు బండ) రైల్వే ట్రాక్ రోడ్డు కు వెళ్ళడానికి  వీలుగా  నిర్మించే లింక్ రోడ్డు  నిర్మాణం కోసం జిహెచ్ఎంసి  టౌన్ ప్లానింగ్ ఏసీపీ  సంపత్ తో కలిసి విప్ గాంధీ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన రోడ్లకు చివరన లింక్ రోడ్లు అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారని..వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని లింక్ రోడ్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైశాలి నగర్ కాలనీ వాసుల,ప్రజల సౌకర్యార్థం లింక్  రోడ్డు  నిర్మాణం వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.రోడ్లు బావుంటే..అభివృద్ధి  వేగంగా జరుగుతుందన్నారు విప్ గాంధీ. ప్రజల రవాణా సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ  రోడ్డు ను  నిర్మించేలా తగు చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వ విప్ గాంధీ  అధికారులను ఆదేశించారు.రోడ్డు ను త్వరితగతిన  ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శాస్త్రి ,గణేష్,అంజి రెడ్డి ,వినోద్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment