
1.3kViews
ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ పై భారత్ జట్టు ఘనవిజయం సాధించింది. మక్కా ఆఫ్ క్రికెట్ గా పిలవబడే లార్డ్స్ మైదానంలో విరాట్ కోహ్లీ సేన విజయకేతనం ఎగురవేసి 75 ఏళ్ళ స్వాతంత్ర్య వేడుకలకు కొనసాగింపుని అందించినట్టయింది. బౌలర్ల బ్యాటింగ్ సాహసాలను మరవకముందే తమ అత్యుత్తమ బంతులతో ఇంగ్లీష్ టీమ్ ని బురిడి కొట్టించారు. ఐదు టెస్టుల్లో ఒకటి డ్రాగా ముగియగా, రెండో టెస్టులో నేడు భారత్ గెలిచి సిరీస్ లో 1-0 లీడ్ కి చేరుకుంది.