
1.3kViews
హైదరాబాద్ (తెలంగాణ మిర్రర్): దర్శక లీడర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరి సినిమా విడుదల ఎన్నో వాయిదాలు పడుతూ ఫైనల్ గా వినాయక చవితి రోజున విడుదలకు సిద్ధమైంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ స్టోరి మూవీకి సంబంధించి విడుదలైన గ్లిమ్స్, పాటలు మంచి అప్లాజ్ అందుకున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చివరగా ఫిదా సినిమా వచ్చింది. కొత్త తరహా కథలు, రియాల్టీకి దగ్గరగా ఉండే సన్నివేశాలను చూపించే శేఖర్ కమ్ముల సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. పండుగకి విడుదలయ్యే లవ్ స్టోరిపై అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాలున్నాయి.