Home » రోడ్ల యాక్సిడెంట్స్ పై ప్రజల్లో అవగాహనా కల్పిస్తున్న మెడికవర్ హాస్పిటల్ వైద్యులు

రోడ్ల యాక్సిడెంట్స్ పై ప్రజల్లో అవగాహనా కల్పిస్తున్న మెడికవర్ హాస్పిటల్ వైద్యులు

by Admin
11.7kViews
229 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : సోమవారం నాడు వరల్డ్ ట్రామా డే పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారి సహకారంతో గచ్చిబౌలి ట్రాఫిక్ సిగ్నల్స్, సైబర్ టవర్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ లలో రోడ్ యాక్సిడెంట్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యవసర సమయంలో వైద్య సహాయం అవసరమయ్యే రోగులకు సత్వర ప్రధమ చికిత్స ఎలా అందించాలో మెడికవర్ హాస్పిటల్స్, అత్యవసర విభాగం డాక్టర్స్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిధులుగా గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ శ్రీనాథ్ గామరియు మాదాపూర్ ట్రాఫిక్ సీఐ నర్సయ్య పాల్గొన్నారు. గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ శ్రీనాథ్ మాట్లాడుతూ రోడ్ ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి అని గణాంకాలు చెబుతున్నాయి. మితిమీరిన వేగం, హెల్మెట్ లేకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి కారణాలతో చాల మంది రోడ్ ప్రమాదాల్లో వారి ప్రాణాలను అర్దాంతరంగా పోగొట్టుకుంటున్నారు. 90 శాతం మరణాలకు సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. ప్రతి ఒక్కరి జీవితం చాలా విలువైనది, మన అందరం సరైన భద్రతా ప్రమాణాలు పాటించి ఇతరులకు అవగాహనా కల్పించాలి అని అన్నారు… అనంతరం న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించడం వల్ల మనం ప్రజల్లో అవగాహన కల్పించడం కొరకు ఈ యొక్క వరల్డ్ ట్రామా డే నిర్వహిస్తున్నాం.ప్రతిరోజూ 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. గాయాలు మరియు మరణాలను తగ్గించడానికి, అలాగే దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగిన గాయం సంఘటనల అనంతర ప్రభావాలను తగ్గించడానికి మనం ఈ రోజు జరుపుకుంటున్నాం అని అన్నారు. అత్యవసర వైద్య విభాగం అధిపతి, డాక్టర్ సతీష్ కుమార్ కైలాసం రోడ్డు ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా బాధాకరమైన అనుభవాలకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. “తగిన వైద్య సమాచారం లేకుండా , రోగులు ఉన్నట్టుండి అత్యవసర స్థితిలో మా విభాగానికి వస్తారు , ట్రామా (గాయాన్ని) తీవ్రతను అన్నికోణాల్లో విశ్లేషించి తక్షణమే మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడడం అనేది సవాలుతో కూడుకున్న విషయమైనప్పటికీ మా బృందం సత్వర చికిత్సనందించడంలో నిమగ్నమైవుంటుందని అయన అన్నారు. 24 గంటలూ అనుభవజ్ఞులైన డాక్టర్లు, లెవల్ 1 అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ సెంటర్‌ ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యపడుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ సునీల్ అప్సంఘి, చంద్రశేఖర్, డాక్టర్ మాణిక్ ప్రభు, క్లస్టర్ హెడ్ దుర్గేష్ ,సెంటర్ హెడ్ మాత ప్రసాద్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

You may also like

Leave a Comment