Home » రైతు సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే మదన్ రెడ్డి

రైతు సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే మదన్ రెడ్డి

by Admin
1.2kViews

తెలంగాణ మిర్రర్, నర్సాపూర్:  రైతు సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు బుధవారం శివంపేట మండలంలోని సికింద్లాపూర్, గోమారం, పెద్ద గొట్టిముక్కల, శివంపేట్, తదితర గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చేటప్పుడు కొద్దిగా ఓపిక అవసరమని అన్నారు రైతులు దళారుల ద్వారా మోసపోకుండా రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని గిట్టుబాటు ధర పొందాలని తెలిపారు. అదే విదంగా గోమారం చెరువులో చేప పిల్లలను వదిలారు.  ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ, జిల్లా కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు లావణ్య మాధవ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment