Home » రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది : గూడెం మహిపాల్ రెడ్డి

రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది : గూడెం మహిపాల్ రెడ్డి

by Admin
980Views

*వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు.

*దేశానికి అన్నపూర్ణ తెలంగాణ. 

*ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోండి.

*దళారులను ఆశ్రయించకండి.

*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

తెలంగాణ మిర్రర్, పటన్ చెరు:   ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని పటాన్ చెరు  శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రైతులను కోరారు. శుక్రవారం పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల, పటాన్ చెరు మండలాలతో పాటు, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చేటప్పుడు ధాన్యం లో తేమ లేకుండా, వ్యవసాయ శాఖ అధికారి తో ధృవీకరణ తీసుకొని రావాలని సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పుల మూలంగా నేడు రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, కాలేశ్వరం, సకాలంలో ఎరువులు అందించిన మూలంగా ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు.

పటాన్ చెరు మండలం లో..

పటాన్ చెరు మండల పరిధిలోని లక్దారం, రుద్రారం, పెద్దకంజర్ల సొసైటీల పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాలకవర్గ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, రైతులు పాల్గొన్నారు.

తెల్లాపూర్ లో..

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, సొసైటీ చైర్మన్ బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గుమ్మడిదల మండలంలో..

గుమ్మడిదల మండల పరిధిలోని గుమ్మడిదల, అన్నారం, కొత్తపల్లి, కానుకుంట, నల్ల వల్లి సొసైటీల పరిధిలో ఐకెపి సౌజన్యంతో ఏర్పాటుచేసిన వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో గుమ్మడిదల మండలం నియోజకవర్గంలోనే ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. గన్ని బస్తాల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి కుమార్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, వ్యవసాయ శాఖ, ఐకెపి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment