
1.1kViews
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రాష్ట్రంలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు,ఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్నికేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ బుధవారం ప్రభుత్వ విప్ గాంధీ ఆధ్వర్యంలో మియాపూర్ క్రాస్ రోడ్డు బొల్లారం చౌరస్తాలో ముంబయి జాతీయ రహదారి పై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రస్తా రోకో నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పండిన ప్రతీ గింజ కేంద్రం కొనుగోలు చేసేదాకా రైతుల తరపున టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల నిరంకుశంగా వ్యవరిస్తుందని,తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్నికేంద్రం కొనకుండా,రాష్ట్రం కొనే అవకాశం లేకుండా రైతు చట్టాలతో చేతులు కట్టేసిందని ఎద్దేవా చేశారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నను వ్యతిరేఖ వ్యవసాయ చట్టాల పేరుతో రోడ్లపై ఆందోళనల్లో కూర్చోబెట్టిన ఘనత బిజెపిదేనని అన్నారు. రైతులు కష్టపడి పండించిన వరి పంటను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్ధృతంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇంత మండుటెండలో కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతుల పక్షాన ధర్నా చేస్తున్నారని,ఇప్పటికైనా బీజేపీ సర్కార్ బుద్ధి తెచ్చుకుని కళ్లు తెరవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులు తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని, వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్,జగదీశ్వర్ గౌడ్,ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, పూజిత జగదీశ్వర్ గౌడ్ ,రోజాదేవి రంగరావు ,మాజీ కార్పొరేటర్ సాయి బాబా ,తెరాస నాయకులు,కార్యకర్తలు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు,తెరాస పార్టీ అభిమానులు,శ్రేయభిలాషులు,తెరాస పార్టీ శ్రేణులు రైతులకు సంఘీభావం తెలిపారు.