
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచిన మహోన్నతుడు యోగి వేమన అని రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లా సంజీవ రెడ్డి పేర్కొన్నారు.శేరిలింగంపల్లి పరిధిలోరెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లా సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు.బుధవారం నియోజకవర్గంలోని పలు డివిజన్ లలో నిర్వహించిన జయంతి వేడుకలో వారు పాల్గొని యోగి వేమన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నల్లా సంజీవరెడ్డి మాట్లాడుతూ తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచిన అభ్యుదయవాది,ప్రజాకవి,సంఘ సంస్కర్త యోగి వేమన జయంతి ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలని డిమాండ్ చేసినారు.ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతిని నిర్వహిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్డిజాగృతి అధ్యక్షులు పిట్ల శ్రీనివాసరెడ్డి, తాడూరు గోవర్ధన్ రెడ్డి ,గున్నాల అనిల్ రెడ్డి,దుర్గి రవీందర్ రెడ్డి,కొండవీటి ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి , రవీంద్ర నాథ్ రెడ్డి, ఆల్విన్ కాలనీ సంజీవ రెడ్డి, చంద్రా రెడ్డి, భవానీపురo రఘునందన్ రెడ్డి,లక్ష్మారెడ్డి, గుల్మహర్ పార్క్ నిరంజన్ రెడ్డి,మాదాపూర్ గోవర్ధన్ రెడ్డి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.