
1.1kViews
తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు :పోలియో రహిత సమాజమే మన ధ్యేయం కావాలని అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. ఆదివారం అమీన్‌పూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఐదేళ్లలోపు చిన్నారుల అందరికీ రెండు చుక్కలు అందించి పోలియో మహమ్మారి నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.