Home » రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తుంది : విప్ గాంధీ,కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తుంది : విప్ గాంధీ,కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

by Admin
1.0kViews
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తుందని శేరిలింగంపల్లి శాసనసభ్యులు,ప్రభుత్వ విప్.అరేకపూడి గాంధీ ,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.రంజాన్ మాసం సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ మసీద్ ఇ-నూరు,మసీద్ ఇ-అల్మాదుల్లాహ్ ఖాద్రి,మసీద్ ఇ-సిరాజ్ ఉన్నిసా బేగం సాహెబ్ లో  మస్జీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా (బట్టలను) పేద ముస్లిం కుటుంబాలకు శేరిలింగంపల్లి శాసనసభ్యులు,ప్రభుత్వ విప్.అరేకపూడి గాంధీ,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో పేద ముస్లింలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని,సమాజంలో గౌరవం పెరిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ముస్లిం ప్రజలు అండగా నిలువాలని,అన్ని కులాలును సమానభావంతో చూస్తున్నసెక్యులర్‌ నాయకుడు సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ఎంతోమంది పేద ముస్లిం విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్,ఏకే బాలరాజు యాదవ్,జనరల్ సెక్రటరీ సాంబశివ రావు, మాదాపూర్ డివిజన్ మైనారిటీ అధ్యక్షులు రహీం,సదర లియకత్,షోయబ్,రెహ్మాన్,నాయకులు సలీం,బాబూమియా,అంకారావు, రాములు యాదవ్, మియన్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు షేక్ ఖాజా,యూత్ సభ్యులు మహమ్మద్,మోయిన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment