Home » రామచంద్రాపురం ఉర్సు మహోత్సవంలో కాట శ్రీనివాస్ గౌడ్

రామచంద్రాపురం ఉర్సు మహోత్సవంలో కాట శ్రీనివాస్ గౌడ్

by Admin
1.2kViews

తెలంగాణ మిర్రర్,రామచంద్రపురం : సమాజంలో అందరూ శాంతియుతంగా కలసి మెలసి జీవనం సాగించాలని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు.రామచంద్రపురం పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలోని సైలని బాబా దర్గాలో ఘనంగా నిర్వహించిన ఉర్సు ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ దర్గాలో చాదర్‌ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు , అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఉర్సు ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ డిపార్ట్మెంట్ ఛైర్మెన్ హబీబ్ జానీ,సతీష్ గౌడ్, ఈశ్వర్ సింగ్, శాంతమ్మ, శ్రీరాములు, పీటర్, అయాజ్ అహ్మద్, నగేష్, నవీన్,రసూల్, అజారుద్దీన్, రాంజీ, మీరజ్, జకీర్, షకీల్, ఫర్దీన్, అస్లామ్,ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment