
తెలంగాణ మిర్రర్, పటన్ చెరు: రానున్న సదర్ ఉత్సవాల్లో భాగంగా రామచంద్రపురం పరిధిలోని యాదవ, గొల్లకూరుమ కుల సోదరులతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్న రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్. సదర్ పండుగ నేపథ్యంలో దీపావళి పండుగ అనంతరం జరుపుకునే సదర్ పండుగ గురించి తగిన సూచన సలహాలు తీసుకోవడానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉదేశ్యం అని కార్పొరేటర్ తెలిపారు. నవంబర్ 6న సదర్ పండుగ సండే మార్కెట్ లో నిర్వహిస్తునట్టు అందరి సమక్షంలో నిర్ణయించడం జరిగింది. అలాగే నూతన సదర్ కమిటీ అధ్యక్షుడుగా ఊరేళ్ళ రాజు,జెనరల్ సెక్రటరీ రాగం నవీన్, వైస్ ప్రెసిడెంట్ ఊరేళ్ళ సుధాకర్, రాగం వికాస్, ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్, అప్పలభాస్కర్ ఎన్నుకున్నారు. ఈ ఏడాది జరగబోయే సదర్ పండుగ బాధ్యతలు కమిటీ పర్యవేక్షణ లో జరగాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆలూరి గోవింద్ టౌన్ ప్రెసిడెంట్, తొంట అంజయ్య , సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్, గోపాల కృష్ణ, ఎల్వర్తి మల్లేష్, రాగం రమేష్, బైకన్ సాయిలు, రాగం యాదయ్య, రాములు యాదవ్,ఐలేష్, రాజు, ఊరేళ్ళ శ్రీకాంత్, రాగం శ్రవణ్, తొంట కృష్ణాకాంత్, తొంట నర్సింహా, రామచందర్, శ్యామ్, కృష్ణ, కుమార్, వనం చిన్న, ఎల్వర్తి శ్రీను, అప్పల భాస్కర్ తదితరులు.