Home » రామచంద్రపురం డివిజన్ ను అన్నిరంగాలలో అభివృద్ధి చేస్తున్నాం : కార్పొరేటర్ పుష్పనగేష్

రామచంద్రపురం డివిజన్ ను అన్నిరంగాలలో అభివృద్ధి చేస్తున్నాం : కార్పొరేటర్ పుష్పనగేష్

by Admin
470Views

ఏడాది కాలంలో రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులు….

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : రామచంద్రాపురం డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అన్నారు.డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ 11వ బ్లాక్ లో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు.అనంతరం బస్తీలలో పర్యటించి స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని తెలిపారు.రామచంద్రపురం డివిజన్ ను అన్ని రంగాలలో ఆదర్శవంతంగా  తీర్చిదిద్దుతున్నానని అన్నారు.

కార్పొరేటర్ గా ఏడాది పూర్తి……
రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ గా బూరుగడ్డ పుష్పనగేష్ గెలుపొంది ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా స్థానిక ప్రజలు కార్పొరేటర్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ గా మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.డివిజన్ ను పార్టీలకతీతంగా,అధికారుల సమన్వయంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఏడాది కాలంలో రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకోసం కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలు,అభిమానులు,నాయకులు, కార్యకర్తలు వెన్నంటే ఉండి మరెన్నో అభివృద్ధి పనులు చేసేలా తోడ్పడాలని కార్పొరేటర్ పుష్పనగేష్ కోరారు.డివిజన్ అభివృద్ధిలో సహకరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,ఆర్థిక మంత్రి హరీష్ రావు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య,టౌన్ ప్రెసిడెంట్ ఆలూరు గోవింద్,జనరల్ సెక్రెటరీ బేకు యాదయ్య,అనుబంధ సంస్థ నాయకులు పెద్దరాజు,గడ్డం నాగరాజు,ప్రీతి గౌడ్,సోహెల్,చాంద్, ఆలూరు గోపాలకృష్ణ,సీఎం మల్లేష్,వీరేశం,బుల్లా అశోక్,రాగం యాదయ్య,అశోక్ రెడ్డి,ప్రవీణ్,రవి,ఉష,చాకలి రవి,సుధాకర్, సోమేశ్,కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment