Home » రామచంద్రపురం డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : కార్పొరేటర్ పుష్పనగేష్

రామచంద్రపురం డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : కార్పొరేటర్ పుష్పనగేష్

by Admin
820Views

*శ్రీనివాస్ నగర్ లో సీసీ రోడ్ల పనులు పరిశీలిన..

*శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష 

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు:పటాన్‌చెరు నియోజకవర్గంలోనే రామచంద్రపురం డివిజన్ ను ఆదర్శంగా నిలుపుతానని కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ పేర్కొన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులు,స్థానిక కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ పుష్పనగేష్ మాట్లాడుతూ అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని,సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను,కాంట్రాక్టర్ కు సుంచించారు.అనంతరం కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 26 నుండి జరగనున్న మల్లన్న జాతర సందర్భంగా అన్ని విభాగాల అధికారులు డీఈ శిరీష,ఏఈలు ప్రభు, రామ్మోహన్, ఎస్.ఎస్ వెంకటేశ్వర్లు,ఆలయ కమిటీ సభ్యులు,కురుమ సంఘం సభ్యులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైటింగ్,శానిటేషన్,స్ప్రేయింగ్ పనులు చేయిస్తానని ఆలయ కమిటీ సభ్యులు,కురుమ సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలూరి గోవింద్, టౌన్ ప్రెసిడెంట్, ఆలూరు గోపాలకృష్ణ, కురుమ సంఘం అధ్యక్షులు, సీఎం మల్లేష్,ఆలయ కమిటీ, కురుమ సంఘం సభ్యులు కరికే నర్సింహా,పెద్ద గొల్ల మల్లేష్,కరికే యాదయ్య,కరికే కుమార్,తొంట నర్సింహ,కరికే లక్ష్మయ్య,ఆలూరి లక్ష్మీనారాయణ ,మక్బుల్,సుధాకర్, నాగరాజు,తొల్కట్ట శ్రీను, వెంకట్ రెడ్డి,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment