Home » రాజ్యాంగాన్ని మార్చాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

రాజ్యాంగాన్ని మార్చాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

by Admin
470Views

*దళిత బహుజన గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

తెలంగాణ మిర్రర్,వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం లోని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం దళిత, బహుజన, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం దేశ రూపకల్పనకు మారుపేరు అలాంటి రాజ్యాంగాన్ని అణచివేసే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హేళనగా మాట్లాడటం సమంజసం కాదని ఒక బాధ్యతగల పదవిలో ఉండి రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉండి భారత రాజ్యాంగం పట్ల నిజాయితీ విశ్వసనీయత లేని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటని దళిత బహుజన సంఘ నాయకులు కొనియాడారు గత 73 సంవత్సరాల నుండి భారత రాజ్యాంగం రూపుమాపిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన మేరకు నేడు ప్రజాస్వామిక దేశం భారతదేశం కొనసాగుతుంది అలాంటి గొప్ప శాసన రాజ్యాంగాన్ని మార్చాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం బాధకరమని ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీడియా సమక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనియెడల రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని దళిత బహుజన గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బహుజన ముక్తి పార్టీ జిల్లా అధ్యక్షులు గట్యా నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్, పి ఎన్ పి ఎస్ అధ్యక్షులు రాఘవేంద్ర గౌడ్, బిజెపి మండల అధ్యక్షులు మైపాల్ ముదిరాజ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ కుమార్, విట్టల్ నాయక్, BMP పార్టీ వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి హరినాయక్, జివిఎస్ కుల్కచర్ల మండల అధ్యక్షులు ప్రకాష్ నాయక్, దోమ మండల అధ్యక్షులు సునీల్ నాయక్,జివిఎస్ జిల్లా కార్యదర్శి రాజేందర్ రాథోడ్, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు బాలకృష్ణ, బహుజన సేన జిల్లా కన్వీనర్ వెంకట్, బాబు, శ్రీను, హరికృష్ణ, చందు నాయక్, గిరిజన విద్యార్థి సంఘం గోపాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment