Home » రవీందర్ గౌడ్,కేశవ్ అధ్వర్యంలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర…

రవీందర్ గౌడ్,కేశవ్ అధ్వర్యంలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర…

by Admin
1.4kViews
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని బాపునాగర్ హనుమాన్ దేవాలయం వద్ద చింతకింది రవీందర్ గౌడ్ , కేశవ్ అధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు.స్ధానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జెండా ఊపి శోభయాత్రను ప్రారంభించారు.శనివారం  బాపునాగర్ దాసాఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రారంభమైన యాత్ర గుల్మోహర్ పార్క్,గిడ్డంగి,లింగంపల్లి,తారానగర్, కానుకుంట,చందానగర్,గంగారం హనుమాన్ దేవాలయం మీదుగా హుడా కాలనీ లోని అబయాంజనేయ స్వామి ఆలయం వరకు  విజయ యాత్ర సాగింది.ఈ యాత్రకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నలుమూలల నుంచి యువకులు,హనుమాన్‌ భక్తులు కాషాయ జెండాలతో విజయయాత్రలో పాల్గొని జై శ్రీరామ్‌, జై హానుమాన్ అంటూ నినాదాలు,నృత్యాలు చేశారు.హుడా కాలనీలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో స్వాగత వేదిక ఏర్పాటు చేసిన యాత్రలో పాల్గొన్న భక్తులపై పూల వర్షం కురుపించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులుమారబోయిన రాజు యాదవ్,బీజేపీ నాయకులు గజ్జెల యోగనంద్, మువ్వ సత్యనారాయణ,చింతకింది గోవర్ధన్ గౌడ్, జ్ఞానేంద్ర ప్రసాద్,రవికుమార్ యాదవ్, పుట్టా వినయ్ గౌడ్,పద్మ రావు,కృష్ణ యాదవ్,వేణుగోపాల్ రెడ్డి,రమేష్ సంతోష్ ముదిరాజ్,సురేష్ ,సాయిముదిరాజ్,నర్సింహా రెడ్డి, రవియాదవ్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment