
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్,గంగారాం నుండి టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల సీనియర్ నాయకులు ,యువకులు ,మహిళలు బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా బీజేపీ లో చేరుతున్న శంకర్,నరసింహ,డి. కృష్ణ, అశోక్, స్వామి, బలియాలాల్, రమేష్, బాలకృష్ణ, సాయి, రాకేష్, అఖిల్, సురేష్, శుభాష్, సత్యనారాయణ, శ్రీను, డి. రమేష్, యాదయ్య,రాఘవేంద్ర, కౌశిక్, వెంకటేష్, సునీల్, అంజమ్మ , లక్ష్మీ, యాదమ్మ , సునీత, సంతోష , శ్రీలత నవనీత, అఖిల , తనుజ ,అనిత భాగ్య తదితరులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.గంగారాం అంటే తన తండ్రికి ప్రత్యేకమైన అభిమానం అన్నారు. గ్రామంలో ఎలాంటి ఇబ్బందులున్న ,సమస్యలున్న అర్ధరాత్రి సమయంలో సంకోచించకుండా నాకు ఫోన్ చేయండి ఎల్లపుడూ మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను,ప్రజలను గాలికొదిలేసి వ్యాపారులకు,రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడని అన్నారు.స్థలం కనపడితే భూ కబ్జాలు ,నియోజకవర్గాన్ని ఆయనకు కావలసిన వారికి దొరికినంత దోచుకో అన్న తీరుగా మార్చేశారని ఎద్దేవా చేశారు.స్వర్గీయ పీజేఆర్,తన తండ్రి బిక్షపతి యాదవ్ స్పూర్తితో పనిచేస్తానని, ఆయన కొడుకుగా సేవ చేయడంలో ఆయనకంటే నాలుగు అడుగులు ముందుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లేశ్, రమేష్ ,రాజేష్, ఇమ్రాన్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.