Home » రజకుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

రజకుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

by Admin
1.0kViews
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :  రజకుల ఆరాధ్య దైవం, దీరోదాత్తురాలు చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా ప్రకటించిన ఘనత సీఎం  కేసీఆర్ కే దక్కుతుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు.బుధవారం డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్ మసీద్ బండలో నిర్వహించిన జలనిధి రజక సేవా సంఘం ప్రథమ వార్షికోత్సవంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రజకుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని శేరిలింగంపల్లి డివిజన్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వెనకబడిన రజకుల అభివృద్దికి సీఎం కేసీఆర్‌ ఉచిత కరెంట్‌ను ఇచ్చి సముచిత న్యాయం చేశారని రజకుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. డివిజన్ లో రజకుల కోసం దోబి ఘాట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.  ఎవరికి ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సేవా సంఘం అధ్యక్షుడు జి.జగదీష్, ఉపాధ్యక్షుడు పెద్దిరాజు, వెంకట్ రావు, తాత రావు, జీ. శ్రీనివాస్, రాఘవ, గోపాల్ యాదవ్, పటోళ్ల నరసింహారెడ్డి, రవికిరణ్, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment