
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మారబోయిన రఘునాథ్ యాదవ్ అనంతరం….రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్కూలు బ్యాగుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లాసురూములను సందర్శించి విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారి చదువుల గురించి ఆరా తీశారు, ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. చదువుతోపాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమని తెలిపారు. టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. రాబోయే భవిష్యత్తు అంతా మీదేనని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్య అనేది మనిషికి ఒక ఆభరణంలాంటిదనీ, అది మంచి గౌరవాన్ని సాధించిపెడుతుందని తెలిపారు. చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేయాలనీ, సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఆర్థిక వనరులు లేవనీ, తగిన సౌకర్యాలు లేవనీ ఎవరూ చదువును మధ్యలో వదిలేయకూడదని చెప్పారు. భవిష్యత్తులో ఉన్నత చదువులకు తన వంతుగా సాయం అందిస్తానని రఘునాథ్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్, కుమార్ సాగర్, రాములు గౌడ్, భరత్, శ్రీకాంత్ నాయక్, పవన్, సాయిలు, కాజా సాగర్, ఉదయ్, రఘునాథ్ ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.