Home » రంగనాథ స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

రంగనాథ స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి గ్రామంలో  శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి. అనంతరం శ్రీ రంగనాథ్ స్వామి వారికీ ప్రత్యేక ప్రభోదన ఏకాదశి అభిషేకం అష్టోత్తర…విష్ణ సహసరా నామ పరాయనం నిర్వహిచారు. అదేవిదంగా రంగనాథ స్వామి ఆలయనికీ వెండి శఠరి నీ అందించిన కృష మూర్తి ఉషదేవి కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని రంగనాథ స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయాలు మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడతాయని, గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంజీరా డైమండ్ టవర్స్ రెసిడెంట్స్ కృష్ణమూర్తి, ఉషాదేవి,రాంప్రసాద్,చంద్రశేఖర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, వేణు, రంగస్వామి, చిన్న, శంకర్ , సురేష్,క్రాంతి,మధు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment