
తెలంగాణ మిర్రర్, నర్సాపూర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రలోనే మంచి మద్దతు ధర లభిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సోమక్కపెట్ ద్వారా ఏర్పాటు చేసిన 12 సెంటర్లు, ఐ కె పి ద్వారా 3 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు దళారులకు అమ్మి మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ వరి దాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద, ఎమ్మార్వో సహదేవ్, టి ఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, పి ఏ సి యస్ చైర్మన్ ధర్మారెడ్డి, ఎంపీడీఓ శశిప్రభ, ఏ పి యం ప్రేమలత, సర్పంచులు లక్ష్మి దుర్గారెడ్డి, కవిత, అంకం యాదగిరి, కోలా బిక్షపతి,పరశురాం రెడ్డి, మమతబాబు, మాంతప్ప, మనోహర, పార్టీనాయకులు తదితరులు పాల్గొన్నారు.