Home » ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను ప్రజలకు అందిస్తుంది : ఎమ్మెల్యే గాంధీ

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను ప్రజలకు అందిస్తుంది : ఎమ్మెల్యే గాంధీ

by Admin
1.2kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్ కాలనీ కి చెందిన జె సురేష్ కి అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF -LOC ద్వారా మంజూరైన 2,00,000/- రెండు లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF LOC – మంజూరి పత్రాలను బాధిత కుటుంబానికి అందచేసిన  ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ  శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్ కాలనీ కి చెందిన  జె సురేష్ కి రూ.2,00,000/- ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన అని తెలిపారు. అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గుమ్మడి శ్రీనివాస్, బ్రిక్ శ్రీనివాస్, పోతుల రాజేందర్, అనిల్ కావూరి, మధు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment