Home » ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం : ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ

ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం : ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ

by Admin
610Views

* ఎంపీ,ఎమ్మెల్యే సమక్షంలో తెరాసలో చేరిన బిజెపి నాయకులు, కార్యకర్తలు

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : టిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని వివిధ పార్టీలకు చెందిన నాయకులు తెరాస తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమని ఎంపీ డా. రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.మంగళవారం బీజేపీ పార్టీకి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎంపీ డా. రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికీ తెరాస పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. సీ ఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, అవి జీర్ణించుకోలేక ఇతర పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. అభివృద్ధి అంటే తెరాస, తెరాస అంటే అభివృద్ధి అని అన్నారు.దేశంలో లేని అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారని, మన పథకాలు చూసి దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కాపీ కొడుతున్నాయని అన్నారు. కల్యాణలక్ష్మి,షాదీముభారక్,ఆసరా,ఒంటరి మహిళా పింఛన్లు,కేసీఆర్ కిట్, కంటి వెలుగు పథకాలను ప్రవేశ పెట్టి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నుండి తెరాస పార్టీలోకి చేరిన నాయకులు కిరణ్ కుమార్,శ్యామ్,యాదగిరి,నర్సింహ,వినయ్, శంకర్,చందు, నాని,దేవదుర్గస్వామి,శివరాజ్,వల్లెపు గిరి,తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, కిరణ్ యాదవ్,గంగాధర్ రావు, మోహన్ ముదిరాజ్, ప్రతాప్ రెడ్డి,మాధవరం గోపాల్ రావు ,మహేందర్ ముదిరాజ్,గోపారాజు శ్రీనివాస్ రావు, మహమ్మద్ కాజా,జాంగీర్, సుప్రజా,స్వరూప,హన్మంతరావు, రాజు గౌడ్,రవి గౌడ్ శివ ముదిరాజ్, శ్రీను,వెంకటేష్,జంగం మల్లేష్,శ్రీధర్ ముదిరాజ్,దయానంద్ ముదిరాజ్,రాజేష్ గౌడ్,రాజు ముదిరాజ్, వజీర్,రాజు,విజయ్ ముదిరాజ్, రాజు సుభాష్ చంద్రబోస్ నగర్ తెరాస నాయకులు రాములు నాయక్,బలస్వామి,సంతోష్ ముదిరాజ్ ,సుభద్ర, చందు, శ్రీకాంత్ రెడ్డి,మారయ్య, పోచమ్మ,లక్ష్మణ్,గురువయ్య,నగేష్,లక్ష్మణ్ ముదిరాజ్, స్వామి, కుమార్,నాగేశ్వరవు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment