Home » ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం : ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ

ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం : ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ

by Admin
460Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి  : నియోజకవర్గం పరిధిలోని ముంపు ప్రాంతాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని శేరిలింగంపల్లి శాసన సభ్యులు,విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శనివారం చందానగర్ డివిజన్‌ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ సిబిఆర్ ఎస్టేట్ వద్ద నాల విస్తరణ  పనులను జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి విప్ గాంధీ పరిశీలించారు.ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ వచ్చే వానాకాలం నాటికి ముంపు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, గతంలో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో సమస్య తిరిగి పునరావృతం కాకుండా తగిన ప్రణాళికలు తయారు చేశామన్నారు.ఈ నాలా  పనులు పూర్తయితే సమస్య పరిష్కారమవుతుందని  అన్నారు.పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని,నీటి ప్రవాహానికి అడ్డుగా చెత్త ఉండకుండా చూడాలని అధికారులకు విప్ గాంధీ  సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిహెచ్ఎంసీ అధికారులు ఏఈ రమేష్,వర్క్ ఇన్స్పెక్టర్ జగన్,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు ,కాశినాథ్ యాదవ్,వెంకట్,భారతి అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment